- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahesh Babu కు అక్కగా నటించనున్న సింగర్ సునీత?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం 'SSMB 28'.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం 'SSMB 28'. ఇప్పటివరకు చిన్న షెడ్యూల్ మాత్రమే కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 8 నుంచి స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికీ కృష్ణ మరణంతో వాయిదా వేశారు. అయితే మళ్లీ సంక్రాంతి తర్వాత ప్లాన్ చేయాల్సిందిగా త్రివిక్రమ్‌ను మహేష్ కోరినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సంక్రాంతి తర్వాత ఎలాంటి బ్రేక్ లేకుండా 45 రోజులపాటు షెడ్యూల్ కంటిన్యూ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్ బాబుకు అక్కగా సింగర్ సునీత నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెను నిర్మాతలు సంప్రదించగా సునీత వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- Tags
- mahesh babu
Next Story






