అమ్మనయ్యాక నాలో ఒక ఆడపులి నిద్రలేచినట్లు అనిపిస్తోంది: కియారా అద్వానీ

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-29 13:38:01  IST  )

అది నా లైఫ్‌లో ఒక వండర్‌ఫుల్ ఇయర్ ఎప్పటికీ మర్చిపోలేను .

అమ్మనయ్యాక నాలో ఒక ఆడపులి నిద్రలేచినట్లు అనిపిస్తోంది: కియారా అద్వానీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఇప్పుడు సినిమాల కంటే తన పర్సనల్ లైఫ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. భర్త సిద్ధార్థ్ మల్హోత్రా, కూతురు సారాయాలతో తన ప్రపంచాన్ని మార్చేసుకుంది. ముఖ్యంగా తల్లి అయిన తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి కియారా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.2025, జూలై 15.. ఈ తేదీ కియారా-సిద్ధార్థ్‌ల జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ రోజే వారికి పాప పుట్టింది. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ.. "నేను ఇప్పుడు ఒక తల్లిగా చాలా ప్రొటెక్టివ్‌గా మారాను. నా కూతురు విషయంలో నేను ఒక ఆడపులిలా మారిపోయాను. లోకాన్ని చూసే కోణం మారిపోయింది. ఒకవైపు ఏదీ ముఖ్యం కాదనిపిస్తూనే, మరోవైపు ప్రతి చిన్న విషయం కూడా చాలా ముఖ్యం అనిపిస్తోంది. నా లోపల ఆ చిన్నారి నిరంతరం ఉంటూనే ఉంది" అంటూ తన ఎమోషన్స్ షేర్ చేసుకుంది.

ఇక 2025 సంవత్సరం కియారాకు ఎన్నో తీపి జ్ఞాపకాలను ఇచ్చింది. గర్భవతిగా ఉన్న సమయంలోనే ప్రపంచ ప్రఖ్యాత మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై తన బేబీ బంప్‌ను గర్వంగా ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ "అది నా లైఫ్‌లో ఒక వండర్‌ఫుల్ ఇయర్ ఎప్పటికీ మర్చిపోలేను" అని మురిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ గ్లామర్ ఫీల్డ్‌లో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసిన కియారా, రీసెంట్‌గా 'ఫ్యాషన్ ఐకాన్' అవార్డును కూడా అందుకుని తన సత్తా చాటింది. ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. కియారా ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాబోతున్న ‘టాక్సిక్’ సినిమాలో ‘నాడియా’ అనే పవర్‌ఫుల్ రోల్ చేస్తోంది. ఈ పాత్ర కోసం కియారా మాత్రమే కరెక్ట్ అని డైరెక్టర్ ఫిక్స్ అయ్యారట. ఈ సినిమా 2026, జూన్ 4న థియేటర్లలోకి రాబోతోంది.

Next Story