త్వరలో టిల్లు 3.. కన్ఫామ్ చేసేసిన సిద్ధు జొన్నలగడ్డ!

by Disha Web Desk 8 |
త్వరలో టిల్లు 3.. కన్ఫామ్ చేసేసిన సిద్ధు జొన్నలగడ్డ!
X

దిశ, సినిమా : డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన మూవీ టిల్లు స్క్వేర్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, సిద్ధు జొన్నలగడ్డ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక మార్చి 29న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తుంది. అయితే టిల్లు స్క్వేర్ మూవీ విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ.. డీజే టిల్లు మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకొంది. మొదట్లో అసలు హీరో పాత్ర ఎలా ఉంటుందో ప్రేక్షకులకు తెలియదు. దాంతో మూవీ చూసి సర్‌ప్రైజ్ అయ్యారు. కానీ ఇప్పుడు మూవీలో నా క్యారెక్టర్ గురించి తెలుసు అందుకే మళ్లీ నేను మ్యాజిక్ చేయడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది.ఇక డీజే టిల్లుకు మించి సర్ ప్రైజెస్, షాక్స్ ఉంటాయి. బాగా నవ్వుకుంటూ సినిమాను ఎంజాయ్ చేస్తారు అని చెప్పుకొచ్చారు సిద్ధు.

అదే విధంగా డైరెక్టర్ మల్లిక్ నేను ఒక సినిమా చేద్దాం అనుకున్నాం. అప్పుడే డీజే టిల్లు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అనిపించి, డైరెక్టర్‌ను అడిగాను తాను కూడా ఒప్పుకోవడంతో సినిమా తీశాము. ముఖ్యంగా చెప్పాలంటే, సీక్వెల్ అన్నప్పుడు కథ గురించి బాగా ఆలోచించాం. కానీ మా అదృష్టం కొద్ది ఓ మంచి కథ తట్టింది. అలాగే పార్ట్ 3 కూడా ఉంటుందేమో చూడాలి. లేదా ఇంకా కొత్తగా ఆలోచించి వేరే ఏదైనా ట్రై చేయాలి. రెండు మూడు కొత్త ఆలోచనలైతే ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Read More..

ఆమె నుండి నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అదే : అనుపమ

Next Story