16 మంది అమ్మాయిల‌తో యంగ్ హీరో సినిమా ?

by velandi.Saikiran |   (  Updated:2025-10-14 06:14:20  IST  )

సెట్ నుంచి అలిగి రాశి ఖ‌న్నా వెళ్లిపోయారట. హీరో పాత్ర తనకు నచ్చలేదని కోపంతో వెళ్లినట్లు వెల్లడించారు సిద్దు. అయితే ఆ

16 మంది అమ్మాయిల‌తో యంగ్ హీరో సినిమా ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ గురించి తెలియని వారు ఉండరు. డీజే టిల్లు సినిమాతో బాగా పాపులర్ అయిన సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ తెలుసు కదా ( Telusu Kada) సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన‌ర్‌గా ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతోంది. వైవా హర్ష ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. నీరజ కోన ( Neeraja Kona ) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అక్టోబర్ 17వ తేదీన తెలుసు కదా సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో అలాగే హీరోయిన్లు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. నిన్న ట్రైలర్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ సందర్భంగా షూటింగ్ లో జరిగిన విషయాలను కూడా పంచుకున్నాడు హీరో సిద్దు జొన్నలగడ్డ. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ గురించి సంచలన విషయాన్ని బయట పెట్టాడు. దాదాపు 30 నిమిషాల పాటు క్లైమాక్స్ సీన్‌ ఉంటుందట. అక్క‌డే సినిమా అస‌లు క‌థ ఉంటుంద‌ట‌.

అయితే క్లైమాక్స్ షూట్ జ‌రుగుతున్న‌ప్పుడు, సెట్ నుంచి అలిగి రాశి ఖ‌న్నా వెళ్లిపోయారట. హీరో పాత్ర తనకు నచ్చలేదని కోపంతో వెళ్లినట్లు వెల్లడించారు సిద్దు. అయితే ఆ తర్వాత ఆమెను బతిలాడి షూటింగ్ కు తీసుకువచ్చినట్లు తెలిపాడు. ఆ సమయంలో మొత్తం 16 మంది అమ్మాయిల మధ్య షూటింగ్ జరిగిందని పేర్కొన్నాడు. అక్క‌డ‌ 16 మంది అమ్మాయిలు ఉంటే, తాను ఒక్కడినే మగాడిని అంటూ తెలిపాడు. వాళ్ల మధ్య యాక్టింగ్ చేస్తుంటే చాలా సరదాగా అనిపించిందన్నాడు.

READ MORE ......

‘మిత్రమండలి’ హిట్ అవ్వకపోతే అలా చేయండి అంటూ ప్రియదర్శి సంచలన స్టే‌ట్‌మెంట్.. ఏమన్నాడంటే?

Next Story