స్టార్ కిడ్‌తో హీరో డేటింగ్.. పుకార్లను నిజం చేసేలా పోస్ట్

by Disha Web Desk 4 |
స్టార్ కిడ్‌తో హీరో డేటింగ్.. పుకార్లను నిజం చేసేలా పోస్ట్
X

దిశ, సినిమా : యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది, స్టార్ కిడ్ నవ్యా నవేలి నందా డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సిద్ధాంత్ తాజాగా షేర్ చేసిన ఓ పోస్ట్ నిజంగానే పుకార్లకు దారితీసేలా కనిపిస్తోంది. విషయానికొస్తే.. ఇన్‌స్టా‌గ్రామ్ వేదికగా 'ఈ రోజు కొన్ని నూడుల్స్ తయారు చేశాను' అంటూ నవ్య ఫొటోను నెట్టింట పోస్ట్ చేసింది. అయితే కాసేపటికే 'ఆమె నూడుల్స్ ఇలా ఉంటాయి' అని.. మెడలో చైన్ వేసుకుంటున్న ఫొటో పోస్ట్ చేశాడు. ఇది సాధారణ వీడియోలా అనిపించినప్పటికీ.. నవ్యా నవేలికి ఇచ్చిన రిప్లయ్‌ మాదిరిగా ఉండటం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీంతో వీరిద్దరూ ఖచ్చితంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ చెప్పుకుంటున్నారు. ఇక ఈ పోస్ట్‌పై స్పందించిన నటుడు ఇషాన్ ఖట్టర్ 'ఎవరీ మిస్టరీ ఉమన్' అని ప్రశ్నించడం విశేషం.





Next Story

Most Viewed