అలాంటి అదృష్టం అరుదుగా దక్కుతుంది: Shruti Haasan

by Disha Web Desk 10 |
అలాంటి అదృష్టం అరుదుగా దక్కుతుంది: Shruti Haasan
X

దిశ, సినిమా : స్టార్ నటి శృతిహాసన్ ఈ యేడాది తనకు లక్ కలిసొచ్చిదంటోంది. ఇటీవల విడుదలైన 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' చిత్రాల బిగ్ హిట్లతో ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ.. తను నటించిన తొలి హిందీ చిత్రం 'లక్‌' విడుదలై 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ప్రముఖ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. 'ఏ నటికైనా తాను నటించిన రెండు చిత్రాలు ఒకేసారి విడుదలవడం, ఆ రెండూ సక్సెస్‌ కావడం అరుదుగా జరుగుతుంది. ప్రస్తుతం నేను ఈ విషయంలో నేను హ్యాపీగా ఉన్నా. అలాగే నా తొలి హిందీ చిత్రం 'లక్‌' విడుదలై ఇన్నేళ్లు గడుస్తున్న ప్రేక్షకులు దాని గురించి ఇంకా నాతో మాట్లాడుతుంటే ఆనందంగా అనిపిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నా సింగింగ్‌ కెరీర్‌ గురించి ఎక్కడా మాట్లాడొద్దన్నారు. అలా చేస్తే సినిమాపై ప్రభావం పడుతుందని భయపెట్టేవారు. కానీ, నేను రెండింటికి ఇంపార్టెన్స్‌ ఇస్తూ ముందుకెళ్లాను. మ్యూజిక్‌ ప్రొఫెషన్‌ అనేది నాకు దేవుడు ఇచ్చిన వరం. ఈ ప్రపంచంతో దానిని పంచుకోగలగడం నిజంగా నా అదృష్టమే' అంటూ పలు విషయాలు ప్రస్తావించింది.

ఇవి కూడా చదవండి : Rakhi Sawant : నా భర్త పెద్ద మోసగాడు.. ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నాడు


Next Story

Most Viewed