అతనితో రిలేషన్‌షిప్‌ కన్ఫర్మ్ చేసిన శ్రద్ధా కపూర్.. షాకింగ్ పోస్ట్‌ వైరల్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్(Shraddha Kapoor) అందరికీ సుపరిచితమే.

అతనితో రిలేషన్‌షిప్‌ కన్ఫర్మ్ చేసిన  శ్రద్ధా కపూర్.. షాకింగ్ పోస్ట్‌ వైరల్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్(Shraddha Kapoor) అందరికీ సుపరిచితమే. ఆమె గత ఏడాది ‘స్త్రీ-2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘స్త్రీ-3’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక శ్రద్దా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా ప్రముఖ స్ట్రిప్ట్ రైటర్ రాహుల్ మోడీ(Rahul Modi)తో డేటింగ్ చేస్తున్నట్లు ఎన్నో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఆమె కూడా పలు పోస్టులు షేర్ చేయడంతో డేటింగ్ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. అంతేకాకుండా పలు ఈవెంట్లకు జంటగా హాజరవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

వీరి డేటింగ్‌కు సంబంధించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. కానీ వీరు మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. తాజాగా, శ్రద్దా కపూర్ ఓ పోస్ట్ ద్వారా రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ఇచ్చింది. మీ కోపాన్ని, చిరాకును భరించే వ్యక్తి మీ లైఫ్‌లో ఎవరు అంటూ క్యాప్షన్ పెట్టింది. అంతేకాకుండా రాహుల్‌ను ట్యాగ్ చేసింది. దీంతో అంతా కాబోయే భర్త తన కోపాన్ని, చిరాకును కంట్రోల్ చేసే వ్యక్తి అని చెప్పకనే చెప్పిందని అంటున్నారు. ఈ పోస్ట్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అది చూసిన వారు కొందరు రిలేషన్‌షిప్‌ను కన్ఫార్మ్ చేసిందని చర్చించుకుంటుంటే.. మరికొందరు అప్పుడే కంగాట్స్ చెబుతున్నారు.

Next Story