Mangalavaram Movie లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మిస్ చేసుకున్న అల్లు అర్జున హీరోయిన్

by Disha Web Desk 9 |
Mangalavaram Movie లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మిస్ చేసుకున్న అల్లు అర్జున హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగళవారం’ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీసును ఊపేస్తోంది. ప్రేక్షకుల అంచనాలను బద్దలు చేస్తూ మరింత సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ బ్లాక్ బస్టర్ చిత్రంలో Rx 100 హీరోయిన్ పాయల్ రాజ్‌ పుత్ కథానాయిగా నటించింది. అయితే ముందుగా దర్శక, నిర్మాతలు ఈ బోల్డ్ బ్యూటీ స్థానంలో ‘సిద్దూ ప్రమ్ శ్రీకాకుళం, ఆర్య-2’ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ శ్రద్దదాస్‌ను ఎంపిక చేశారట. కానీ శ్రద్దదాస్ ఈ మూవీ ఆఫర్‌ను రిజక్ట్ చేసిందట. బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని సినిమాను వదులుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ.. బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకోవడంతో శ్రద్దాదాస్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. ఇక పాయల్ రాజ్ పుత్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా కూడా కథ నచ్చడంతో ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.



Next Story

Most Viewed