హీరోయిన్ త్రిష ఎత్తుకుని మరీ ఆడిస్తున్న ఈ బాబు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే? క్యూట్ వీడియో వైరల్

by Disha Web Desk 6 |
హీరోయిన్ త్రిష ఎత్తుకుని మరీ ఆడిస్తున్న ఈ బాబు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే? క్యూట్ వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ త్రిష ఇటీవల వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష ఇప్పటివరకు కోట్లాదిమంది ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది మణిరత్నం భారీ మల్టీస్టారర్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్‌’తో సూపర్ సక్సెస్ అందుకుని అదే ఫామ్‌‌తో ముందుకు పోతుంది. అయితే ఇటీవల త్రిష ఓ బాబుని ఎత్తుకుని కనిపించడంతో అతను ఆమె కొడుకే అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా, త్రిష మరోసారి షూటింగ్‌లో అదే బాబుని ఎత్తుకుని ఆడిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో వెతకడం మొదలెట్టారు. చివరికి ఆ బాబు ఎవరో తెలిసిపోయింది. ఆ బుజ్జి బాబు ఎవరో కాదు మలయాళ నటి మియా జార్జ్ కుమారుడు. త్రిష కీలక పాత్రలో నటించిన మూవీ ‘ది రోడ్’. ఇందులో మలయాళ భామ మియా జార్జ్‌ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ షూటింగ్ టైంలో త్రిష ఇలా మియా జార్జ్ కొడుకుతో ఆడుకుంటూ కనిపించింది. ఇదిలా ఉంటే ‘ది రోడ్’ అక్టోబర్ 6న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక త్రిష వీడియో నెట్టింట వైరల్ కావడంతో మీయా జార్జ్ కొడుకు బలే క్యూట్‌గా ముద్దొస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Read More: చాన్స్ అడిగితే గెస్ట్ హౌస్కు రమ్మన్నాడు.. ‘బాహుబలి’ యాక్టర్ కామెంట్స్ వైరల్


Next Story