షాకింగ్ సీక్రెట్ రివీల్..మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్న బుల్లితెర యాంకర్!

by Disha Web Desk 18 |
షాకింగ్ సీక్రెట్ రివీల్..మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్న బుల్లితెర యాంకర్!
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఆమె సొంతం. పలు షోలలో యాంకరింగ్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఈ అమ్మడుకు మంచి పాపులారిటీ వచ్చిందనే చెప్పాలి. ఇక ఈ నటి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోషూట్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఏమిటంటే?

బుల్లితెర రాములమ్మగా మంచి ఫేమ్ సంపాదించుకున్న శ్రీముఖి త్వరలో మెగా కాంపౌండ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నదంట. ఇప్పటికే చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మకు మరో బంపర్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. చిరు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న విశ్వంభర మూవీలో ఈ అందాల సుందరి ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు టాక్. చిరుతో కలిసి స్టెప్స్ వేయనుందంట. అయితే ఈమెకు మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధమే దీనికి కారణం అంటున్నారు కొందరు. అయితే భోళాశంకర్ మూవీ సమయంలో శ్రీముఖికి మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో వారు ఈ ముద్దుగుమ్మను పిలిచి మరి ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో శ్రీముఖి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. బుల్లితెర రాములమ్మ..చిరుతో కలిసి మాస్ స్టెప్స్ వేయనుందా అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక చూడాలి మరి నిజంగా శ్రీముఖి చిరుతో స్టెప్స్ వేస్తుందో లేక ఇది కూడా ఓ గాసిప్‌నో అంటున్నారు నెటిజన్లు.

Read More..

Chiranjeevi : చిరంజీవి అందుకే రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు.. వైరల్ అవుతోన్న కమెడియన్ సునీల్ కామెంట్స్

Next Story

Most Viewed