- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ న్యూస్.. మరోసారి వాయిదా పడిన ‘టాక్సిక్’.. పోస్ట్‌తో ట్విస్ట్ ఇచ్చిన యష్
సినిమా అయితే సిద్ధంగానే ఉంది, కానీ అంతర్జాతీయ స్థాయిలో పంపిణీ భాగస్వామ్యాల విషయంలో చర్చలు జరుగుతున్నాయి.

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న యష్ నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి హాట్ బ్యూటీస్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై మరింత క్రేజ్ పెరిగింది. నిజానికి ఈ సినిమా ఉగాది కానుకగా విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల జూన్ 4కి వాయిదా వేశారు. అయితే, గత కొద్ది రోజులుగా మూవీ మళ్ళీ వాయిదా పడబోతోందంటూ వస్తున్న వార్తలపై యష్ అధికారికంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. "సినిమా అయితే సిద్ధంగానే ఉంది, కానీ అంతర్జాతీయ స్థాయిలో పంపిణీ భాగస్వామ్యాల విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి అత్యంత భారీగా విడుదల చేయాలనే ఉద్దేశంతోనే ఈ జూన్ 4 తేదీని మారుస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం" అని యష్ పేర్కొన్నారు.
ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. దాదాపు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘టాక్సిక్’ వాయిదా వెనుక పంపిణీ వ్యూహాలే కాకుండా ఓటీటీ బిజినెస్ కూడా ఒక కారణమని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ రూ. 110 కోట్లు ఆఫర్ చేయగా, నిర్మాతలు మాత్రం కనీసం రూ. 250 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. బడ్జెట్, యష్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఈ రేటును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రేట్ల విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ సర్ధుమనిగాక విడుదల తేదీనికి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం కేవలం కన్నడ, తెలుగుకే పరిమితం కాకుండా ఏకంగా ఆరు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల కానుంది. పాన్-ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. యష్ తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.






