Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్.. షాక్‌లో చిత్ర యూనిట్ (వీడియో)

by Disha Web Desk 6 |
Ram Charan :  ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్.. షాక్‌లో చిత్ర యూనిట్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాను శంకర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. పాటలకే కోట్లు ఖర్చు పెడుతున్నాడని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రం నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ఓ సాంగ్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘జరగండి జరగండి జరగండి... జాబిలమ్మ జాకెట్ వేసుకుని వచ్చెనండీ’ అంటూ సాగే మూడు నిమిషాల పాట లీక్ అయింది. దీంతో అది చూసిన నెటిజన్లు మళ్లీ తమన్‌పై ట్రోల్స్ మొదలెట్టారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సాంగ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Next Story

Most Viewed