నాగచైతన్య అలాంటోడు.. సమంతే కరెక్ట్.. డేటింగ్ తర్వాత శోభిత ధూళిపాళ షాకింగ్ కామెంట్స్!

by Disha Web Desk 7 |
నాగచైతన్య అలాంటోడు.. సమంతే కరెక్ట్.. డేటింగ్ తర్వాత శోభిత ధూళిపాళ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: సమంత, నాగచైతన్య విడిపోయి చాలా కాలం అవుతోంది. అయినా సరే వీరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటున్నాయి. ఇక విడాకుల అనంతరం ఎవరి లైఫ్ వాళ్లు లీడ్ చేసుకుంటున్నారు. సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అలాగే నాగచైతన్య కూడా వరుస ప్రాజెక్టులపై సైన్ చూస్తూ.. బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నాగ చైతన్య లైఫ్‌లోకి మరో అందమైన బ్యూటీ శోభిత ధూళిపాళ వచ్చిందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. పైగా వీరిద్దరూ లండన్‌లో షికార్లు చేస్తున్న ఫొటోలు నెట్టింట దర్శనమివ్వడంతో.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఆధ్యం పోసినట్లయింది. ఈ వార్తలపై నాగచైతన్య స్పందించనప్పటికీ.. శోభిత మాత్రం ఇలాంటి పుకార్లను తాను పట్టించుకోను అంటూ కొట్టిపడేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత మాజీ భార్యాభర్తలైన చైతూ, సమంతల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

శోభిత మాట్లాడుతూ.. నాగ చైతన్య ఎంతో మర్యాదస్తుడని, చాలా హుందాగా ఉండే వ్యక్తి అని తెలిపింది. అతడు చాలా సైలెంట్‌గా ఉండే వ్యక్తి. అదే నాకు చైతులో నచ్చుతుంది. అలాగే.. సమంత గురించి మాట్లాడుతూ ఆమె ఒక అద్భుతమైన నటి అని తెలిపింది. ఫ్యామీలి మెన్ వెబ్ సిరీస్‌కు సమంతనే కరెక్ట్ అని.. ఆమె ఎంచుకునే ప్రతి ప్రాజెక్ట్ ఎంతో గొప్పగా ఉంటాయి అంటూ సమంతపై ప్రశంసలు కురిపించింది. శోభిత కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న Samantha.. మెడలో తాళిబొట్టు! ఫొటోలు వైరల్

Next Story

Most Viewed