శోభిత ఒక శక్తివంతమైన వంశానికి నాయకురాలిగా కనిపించబోతోంది: పా రంజిత్

by Mallepaka Hamsa |

నా మునుపటి చిత్రాల కంటే ఇది సాంకేతికంగా చాలా భిన్నంగా ఉంటుంది.

శోభిత ఒక శక్తివంతమైన వంశానికి నాయకురాలిగా  కనిపించబోతోంది: పా రంజిత్
X

దిశ, సినిమా: తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు పా. రంజిత్, ఇప్పుడు ‘వేట్టువం’ (వేట) అనే సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇది కేవలం గొడ్డళ్లు, కత్తుల గ్యాంగ్‌స్టర్ కథ కాదు.. సైన్స్ ఫిక్షన్ అంశాలను గ్రామీణ నేపథ్యానికి జోడించి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్య, దినేష్, శోభిత ధూళిపాళ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా.. ఒక ఇంటర్వ్యూలో రంజిత్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రపంచం ప్రేక్షకులకు ఒక మైండ్ బ్లోయింగ్ అనుభవాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ సినిమా థీమ్ గురించి వివరిస్తూ.. "వేట్టువం అంటే ఒకరిని ఒకరు వేటాడటం. ఇక్కడ కథ ఐదు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది. మనం సాధారణంగా హీరో-విలన్ మధ్య గొడవ చూస్తాం, కానీ ఇందులో ప్రతి పాత్ర మరో పాత్రకు శత్రువే! ఒకరి ప్రపంచంలో ఇంకొకరు విలన్. ఐదు వేర్వేరు వంశాల మధ్య జరిగే ఆధిపత్య పోరాటమే ఈ మూవీ" అని రంజిత్ చెప్పారు. ఇందులో ఆర్య నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుండగా, నటి శోభిత ధూళిపాళ ఒక శక్తివంతమైన వంశానికి నాయకురాలిగా కనిపించబోతోంది’’ అని అన్నారు. అంతేకాకుండా షూటింగ్ గురించి వివరిస్తూ.. ‘‘నటుడు దినేష్ ఈ సినిమా కోసం తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నారు. చిన్న వయస్సు కుర్రాడిగా కనిపించడమే కాకుండా, కఠినమైన మార్షల్ ఆర్ట్స్,ప్రత్యేక పోరాట పద్ధతుల్లో శిక్షణ పొందారు. నా మునుపటి చిత్రాల కంటే ఇది సాంకేతికంగా చాలా భిన్నంగా ఉంటుంది. షూటింగ్ పూర్తయింది, కొన్ని ప్యాచ్ వర్క్ భాగాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. నేను చూసిన ఫుటేజ్ అద్భుతంగా ఉంది. తమిళ సినిమాలో ఇది ఒక ముఖ్యమైన మలుపు అవుతుంది" అని పా. రంజిత్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story