నాగచైతన్యకు బిగ్ షాకిచ్చిన శోభిత.. చర్చనీయాంశంగా మారిన కామెంట్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-12 09:57:40  IST  )

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత ధూళిపాళ షాకింగ్ కామెంట్స్ చేసి నాగచైతన్యకు షాకిచ్చింది. తనకు నచ్చిన హీరో ప్రభాస్ (Prabhas)అని చెప్పడం గమనార్హం. ‘‘ప్రభాస్ నా అభిమాన హీరో మాత్రమే కాదు.. నా మనసుకు ఎంతో దగ్గరైన నటుడు అని చెప్పింది.

నాగచైతన్యకు బిగ్ షాకిచ్చిన శోభిత.. చర్చనీయాంశంగా మారిన కామెంట్స్!
X

దిశ, సినిమా: బోల్డ్ పాత్రలతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వివాహం తర్వాత నుంచి శోభిత పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది. త్వరలోనే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత ధూళిపాళ షాకింగ్ కామెంట్స్ చేసి నాగచైతన్యకు షాకిచ్చింది. తనకు నచ్చిన హీరో ప్రభాస్ (Prabhas)అని చెప్పడం గమనార్హం. ‘‘ప్రభాస్ నా అభిమాన హీరో మాత్రమే కాదు.. నా మనసుకు ఎంతో దగ్గరైన నటుడు. ముఖ్యంగా ‘ఛత్రపతి’ సినిమా అంటే నాకు అపారమైన ఇష్టం.

ఇప్పటికీ ఆ మూవీ చూస్తే అదే ఉత్సాహం, అదే ఎమోషన్ కలుగుతుంది. డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిసినప్పుడు వచ్చే ఫీల్ మాటల్లో చెప్పలేనిది. ప్రభాస్ నటనలో సహజత్వం, గంభీరత, సింప్లిసిటీ అన్నీ సమానంగా కనిపిస్తాయి. యాక్షన్ సీన్స్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తూనే, భావోద్వేగ సన్నివేశాల్లో ఎంతో లోతుగా నటించగలగడం ఆయన ప్రత్యేకత. అందుకే ప్రభాస్ చేసిన చాలా సినిమాలు నాకు ఎంతో నచ్చుతాయి. ‘బాహుబలి’ వంటి సినిమాలతో ఆయన భారతదేశం గర్వపడే స్థాయికి ఎదగడం అభిమానిగా నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.

అంతటి స్టార్ అయినా కూడా వినయం, సరళతతో ఉండడం ప్రభాస్‌ను మరింత గొప్ప మనిషిగా నిలబెడుతుంది. ఆయన సినిమాల కోసం ఎంతకాలమైనా ఎదురుచూడగలిగే ఓ అభిమాని మనసు నాకు ఉంది. ప్రేరణ. నటన, ఓర్పు, అంకితభావం అన్నింటికీ ఆయన నిలువెత్తు ఉదాహరణ. కూడా ఆయన నుంచి మరెన్నో గొప్ప సినిమాలు రావాలని, ప్రేక్షకులను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు భర్తను కాకుండా ప్రభాస్ అని చెప్పి షాకిచ్చిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అది అక్కినేని హీరోలకు పెద్ద అవమానకరం అని అంటున్నారు. మరికొందరు ఎవరి వ్యక్తిగత ఇష్టాలు వారికి ఉంటాయని అందులో తప్పేముందని వాదిస్తున్నారు.

Related News : శివాజీ గారు చెప్పిన పాయింట్ కరెక్టే కానీ వాడిన భాష చండాలం.. సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Next Story