ఎట్టకేలకు గుడ్ న్యూస్ ప్రకటించిన శోభితా దూళిపాళ.. అవసరమా అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ(Sobhita Dhulipala) ‘సైకో రామన్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.

ఎట్టకేలకు గుడ్ న్యూస్ ప్రకటించిన శోభితా దూళిపాళ.. అవసరమా అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ(Sobhita Dhulipala) ‘సైకో రామన్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించి తన నటనతో ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. అలాగే తెలుగులోనూ మేజర్, గూఢచారి లో నటించింది. పొన్నియన్ సెల్వన్-1, పొన్నియన్ సెల్వన్-2 మూవీస్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక గత ఏడాది మంకీ మ్యాన్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక శోభిత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. కొద్ది కాలంపాటు టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో డేటింగ్ చేసింది. వీరిద్దరు 2024లో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత శోభిత పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అవ్వగా.. నాగచైతన్య ‘తండేల్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

శోభిత మాత్రం ఇండస్ట్రీకి, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఇంటి పనుల్లో బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుడ్ న్యూస్ ప్రకటించింది. మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు హింట్ ఇచ్చింది. తన సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కంప్లీట్ చేసినట్లు ఫొటోలను షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు కుకింగ్ అనే క్యాప్షన్ జత చేసింది. కానీ ఏ మూవీ కోసమో వెల్లడించలేదు. దీంతో అది చూసిన నెటిజన్లు కొందరు ప్రెగ్నెన్సీ ప్రకటన చేస్తుందనుకుంటే.. రీఎంట్రీపై పోస్ట్ పెడుతుందని అస్సలు ఊహించలేదని అంటుంటే.. మరికొందరు మాత్రం సినిమాలు అవసరమా పిల్లలను కని మంచిగ ఇంటి బాధ్యతలు చూసుకోక అని అంటూ తిడుతున్నారు. కానీ అక్కినేని అభిమానులు మాత్రం పెళ్లైతే మూవీస్ చేయొద్దని రూల్ ఉందా అని.. ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Next Story