- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తేజకరమైన అధ్యాయం ప్రారంభమవుతుందంటూ శివాత్మిక పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
టాలీవుడ్ స్టార్ హీరో రాజశేఖర్ కూతురిగా శివాత్మిక (Shivathmika Rajasekhar)ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో రాజశేఖర్ కూతురిగా శివాత్మిక (Shivathmika Rajasekhar)ఇండస్ట్రీకి పరిచయం అయింది. ‘దొరసాని’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత పంచతంత్రం, కల్కి, ఆకాశం, రంగమార్తండ, వంటి మూవీస్ చేసింది. అంతేకాకుండా తమిళంలోనూ నటించి శివాత్మిక అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. శివాత్మిక త్వరలోనే ‘బాంబ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
విశాల్ వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్, అర్జున్ దాస్ జంటగా నటించారు. దీనిని జెంబ్రియో పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో కాళి వెంకట్, నాసర్, అభిరామి, సింగంపులి, బాలా శరవణన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, శివాత్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ కొత్త సినిమాను ప్రకటించింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తైనట్లు వెల్లడిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
ఈ సినిమాలో శివాత్మిక ‘35 చిన్న కథ కాదు’తో హిట్ అందుకున్న విశ్వ దేవ్ రాచకొండ(Vishva Dev Rachakonda) జత కట్టబోతున్నారు. అదిత్యమండల(Adityamandala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గోల్డ్ బాక్స్ బ్యానర్‌పై చిరు కూతురు సుస్మిత కొనిదెల నిర్మాణంలో రాబోతున్న 7వ ప్రాజెక్ట్ కావడం విశేషం. ‘వరం’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ శివాత్మిక త్వరలోనే ఉత్తేజకరమైన అధ్యాయం ప్రారంభమవుతుందని తెలపడంతో నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అలాగే హిట్ అందుకోవాలని కోరుతున్నారు.






