- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరంజీవి కుటుంబంతో గొడవలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన శివాని..!
సీనియర్ హీరో రాజశేఖర్, జీవితకు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. అలాగే వీరి కుమార్తె శివాని పలు చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ హీరో రాజశేఖర్, జీవితకు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. అలాగే వీరి కుమార్తె శివాని పలు చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే శివాని ‘కోట బోమ్మాలి’ చిత్రంతో నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, శివాని, రాహుల్, శ్రీకాంత్ నటిస్తున్నారు. తాజాగా, ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న శివాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ మెగా ఫ్యామిలీకి మా కుటుంబానికి కొన్ని వివాదాలు అయితే జరిగాయి. కానీ పాలిటిక్స్ ఉన్నప్పుడు అలాంటివి జరిగాయి. అవసరం అయినప్పుడు మాత్రం కచ్చితంగా అంతా కలిసి పోతాము.
మేమంతా ఒకే ఇండస్ట్రీలో ఉన్నాము..కాబట్టి ప్రొఫెషనల్ వేరు పర్సనల్ వేరు గానే ఉంటుంది. గతంలో ఎప్పుడో చిన్న చిన్న గొడవలు జరిగినా కూడా వాళ్ల ప్రొడక్షన్ లో నేను నటించకూడదని రూలేమీ లేదు కదా మా ప్రొడక్షన్ లో వాళ్లు నటించకూడదని రూలేం లేదు. సినిమా పరంగా అందరం ఒకటిగా ఆలోచిస్తాము. ఎలాంటి గొడవలు జరిగిన నా సపోర్ట్ ఫ్యామిలీకే ఉంటుంది’’ అని శివాని చెప్పుకొచ్చింది.






