- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి కామెంట్స్‌తో చిక్కుల్లో పడిన శివానీ నాగరం.. గర్వంగా చెప్పబోయే అడ్డంగా బుక్ అయిందిగా!
మా అమ్మ నాకు థాంక్స్ చెప్పడం చాలా గౌరవంగా అనిపించింది. అదంతా చూశాక అసలు నాకేం వద్దు ఇక అనిపించింది.

దిశ, సినిమా: టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ హీరోయిన్ శివాని నాగరం (Shivani Nagaram)ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నారు. తన సినిమా సక్సెస్ ఆనందంలో ఆమె పంచుకున్న ఒక అనుభవం, ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీస్తోంది. ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు’ (Ambaji Peta Marriage Band)సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన శివాని నాగరం, తాజాగా ‘హే బలవంత్’ సినిమాతో హ్యాట్రిక్ హిట్ దిశగా దూసుకెళ్తున్నారు. అయితే, వృత్తిపరంగా సంతోషంగా ఉన్న ఈ భామకు, తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో ఎదురైన ఒక అనుభవం ఇప్పుడు నెగిటివ్ టాక్‌ను తెచ్చిపెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శివాని తన తిరుపతి పర్యటన గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘దాదాపు 13 ఏళ్ల తర్వాత ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సక్సెస్ సందర్భంగా మా కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లాను.
అక్కడ స్వామివారి ద్వారం దగ్గర నన్ను దాదాపు 15 నిమిషాల పాటు అలాగే నిల్చోబెట్టారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న భక్తులు కొందరు ‘గోవిందా గోవిందా’ అంటుంటే, మరికొందరు నా పాత్ర పేరు పెట్టి ‘కాత్యాయిని భోంచేశావా?’ అని అరిచారు. నా వల్ల మా అమ్మ కూడా అంతసేపు స్వామివారిని చూస్తూ ఉండిపోయింది. ఆమె నాకు థాంక్స్ చెప్పడం చాలా గౌరవంగా అనిపించింది. అదంతా చూశాక అసలు నాకేం వద్దు ఇక అనిపించింది’’ అని శివాని చెప్పుకొచ్చారు. శివాని ఈ విషయాన్ని ఎంతో గర్వంగా పంచుకున్నప్పటికీ, నెటిజన్లు మాత్రం దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. మీ అమ్మ 15 నిమిషాలు స్వామిని చూసిందని నువ్వు మురిసిపోతున్నావు.. కానీ నీ వల్ల వెనుక ఉన్న వందలాది మంది భక్తులు స్వామిని సరిగ్గా చూడలేకపోయారు, వారి శాపం నీకు తగలదా?" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. శివాని దానిని ఒక ఘనతలా చెప్పుకోవడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. గర్వంగా చెప్పబోయే అడ్డంగా బుక్ అయిందంటూ ట్రోల్ చేయడంతో పాటు నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.






