- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివాని నాగరం కోలీవుడ్ ఎంట్రీ.. యంగ్ హీరోతో జోడీ.. అదృష్టం కలిసొచ్చేనా?
శివాని ఇప్పుడు కోలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందని సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు అభిషన్ జీవింత్ హీరోగా నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌లో శివాని హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శివాని నాగరం ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది, తొలి ప్రయత్నంలోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో శివాని పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఆ తర్వాత మౌళి సరసన నటించిన ‘లిటిల్ హార్ట్స్’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమెను లక్కీ హీరోయిన్ గా పిలవడం మొదలుపెట్టారు. తాజాగా శివాని నాగరంకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. శివాని ఇప్పుడు కోలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందని సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు అభిషన్ జీవింత్ హీరోగా నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌లో శివాని హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
అభిషన్ జీవింత్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో దర్శకుడిగా మారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘విత్ లవ్’ మూవీతో హీరోగా మారి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా తన రెండో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి డెబ్యూటెంట్ గౌతమ్ శివరామన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోనే శివాని నాగరం ఒక హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఫేమ్ యోగలక్ష్మి కూడా మరో కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇటీవల ‘హే భగవాన్’ చిత్రంతో శివాని పలకరించినప్పటికీ, ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ, నటిగా శివాని తన ప్రతిభను చాటుకోవడంతో అవకాశాలకు మాత్రం లోటు లేదు. ఇప్పుడు నేరుగా కోలీవుడ్ హిట్ కాంబినేషన్‌లో ఛాన్స్ దక్కించుకోవడంతో శివాని రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. తెలుగులో రెండు హిట్లు అందుకున్న ఈ చిన్నది, ఇప్పుడు తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.






