కమల్ హాసన్, శింబు కాంబినేషన్‌లో సినిమా.. నెక్స్ట్ లెవల్ అంతే..

by Disha Web Desk 6 |
కమల్ హాసన్, శింబు కాంబినేషన్‌లో సినిమా.. నెక్స్ట్ లెవల్ అంతే..
X

దిశ, సినిమా : కమల్ హాసన్, శింబు కాంబినేషన్‌లో #STR48 సినిమాను ప్రకటించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై కమల్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న చిత్రంలో శింబు కథానాయకుడు కాగా దేశింగ్ పెరియసామి రచన, దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడితాల్’ విజయం తర్వాత పెరియసామి చేస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ మరో అద్భుతమని తెలిపాడు హీరో.

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ సర్ ప్రొడక్షన్‌లో పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఈ చిత్రం తన కెరీర్‌లో మైలురాయిగా మిగిలిపోతుందని నమ్మకం వ్యక్తం చేశాడు. శ్రేష్టమైన చిత్రాలని అందించడం రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లక్ష్యమన్న నిర్మాత కమల్.. శింబు, పెరియసామికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Next Story

Most Viewed