పురుషాంగం తాకిస్తూ అలా చేయమని బెదిరించాడు.. దర్శకుడిపై నటి ఫిర్యాదు

by Disha Web Desk 7 |
పురుషాంగం తాకిస్తూ అలా చేయమని బెదిరించాడు.. దర్శకుడిపై నటి ఫిర్యాదు
X

దిశ, సినిమా : హిందీ చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్‌పై నటి షెర్లిన్ చోప్రా మరోసారి లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపుల ఆరోపణలు చేసింది. అంతేకాదు ప్రస్తుతం 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌గా కొనసాగుతన్న సాజిద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నటి.. 'నేను ఇటీవల #MeToo నిందితుడు సాజిద్ ఖాన్‌పై బలవంత లైంగిక దోపిడీ, నేరపూరిత బెదిరింపులపై ఫిర్యాదు చేశాను. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందని పోలీసులు అడిగారు. నేను 2005లో జరిగిందని సమాధానం ఇచ్చాను.

వారిని సంప్రదించడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. సాజిద్ లాంటి పేరున్న వ్యక్తి మీద లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసే ధైర్యం అప్పట్లో లేదని చెప్పాను. అయితే 2018 #MeToo తర్వాత ఎంతోమంది మహిళలు తమ గోడును వినిపించేందుకు ముందుకొచ్చారు. కాబట్టి అతన్ని జైలులో పెట్టాలి' అని కోరింది. అలాగే రోజుకు ఎన్నిసార్లు సెక్స్ చేస్తారు, ఎంత మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు? అని తనను అడిగాడన్న ఆమె.. పురుషాంగాన్ని చూపిస్తూ తనకు తాకించేందుకు ప్రయత్నించాడని చెప్పింది. చివరగా ఒక దర్శకుడు లేదా నిర్మాతతో వృత్తిపరమైన సమావేశంలో పాల్గొన్నపుడు స్పై కెమెరాను తీసుకెళ్లకపోవడంతో తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వాపోయింది.

ఇవి కూడా చదవండి :

డబుల్ మీనింగ్ డైలాగులతో జబర్దస్త్‌లో రోహిణి రచ్చ

Pawan Kalyan స్పీచ్‌పై Ram Gopal Varma సంచలన కామెంట్స్


Next Story

Most Viewed