'మీటూ' నిందితుడికి స్టార్ నటి సపోర్ట్.. దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్

by Disha Web Desk 21 |
మీటూ నిందితుడికి స్టార్ నటి సపోర్ట్.. దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ షెహనాజ్ గిల్ మరోసారి దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. హిందీ 'బిగ్ బాస్ 16'లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రముఖ నటుడు, ఫిల్మ్ మేకర్ సాజిద్ ఖాన్‌కు మద్దతుగా నిలిచినందుకు నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. గతంలో 'మీటూ' నిందితుడిగా విమర్శలపాలైన సాజిద్‌ను ఎలా సపోర్ట్ చేస్తావంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు సిద్ధార్థ్ శుక్లా మరణం తర్వాత ఓ ఎంగేజ్‌మెంట్ పార్టీలో డ్యాన్స్ చేయడం, సల్మాన్‌ను కౌగిలించుకుని ముద్దుపెట్టుకోవడం వంటి కాంట్రవర్సీ విషయాలను ప్రస్తావిస్తూ కడిగిపారేస్తున్నారు.

ఇక ప్రతి ఒక్కరినీ తన ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నందుకు ఆమెను దూషించడం సరైందేనంటున్న నెటిజన్లు.. సాజిద్‌ఖాన్ సినిమాలో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తోందని, తన ఎదుగుదలకోసం సిద్ధార్థ్ శుక్లా పేరు ప్రతిష్టలు కూడా వినియోగించుకుంటోందని తిట్టిపోస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ఈ కష్టాల కడలి దాటేదెన్నడు.. సోనీ హార్ట్ బ్రేకింగ్ నోట్



Next Story

Most Viewed