- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడు చనిపోతే జీవితాంతం ఏడుస్తూ కూర్చోవాలా? .. ట్రోలింగ్‌పై నటి ఫైర్
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ షెహనాజ్ గిల్ ప్రియుడు సిద్ధార్థ్ శుక్లా మరణంతో కుంగిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవలే ఆ బాధనుంచి కోలుకుంటున్న నటి పలు పార్టీలకు అటెండ్ అవుతూ సరదాగా కనిపిస్తోంది..Latest Telugu News

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ షెహనాజ్ గిల్ ప్రియుడు సిద్ధార్థ్ శుక్లా మరణంతో కుంగిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవలే ఆ బాధనుంచి కోలుకుంటున్న నటి పలు పార్టీలకు అటెండ్ అవుతూ సరదాగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఎంగేజ్‌మెంట్ పార్టీలో నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో మింగుడు పడని జనాలు దారుణమైన ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీంతో మరోసారి మనస్తాపం చెందిన షెహనాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ట్రోలర్స్‌కు చురకలంటించింది.
'మా గురించి పూర్తిగా తెలియని జనాలు ఎందుకిలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నా జీవితం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారా? గతాన్ని మరిచిపోయి జీవితాన్ని పునఃప్రారంభించాలనుకుంటున్నా. ఆనందంగా స్క్రీన్ ముందుకు రావాలనుకుంటున్నా. విమర్శలు చేసేవారు కాస్త ఆలోచించండి. ఇతరులకు మర్యాద ఇస్తేనే మీరు గౌరవించబడతారనే సత్యాన్ని తెలుసుకోండి. కాగా సిద్ధు మరణం తర్వాత కుంగిపోయిన షెహనాజ్.. 'తు యాసీన్ హై' వీడియో రిలీజ్ చేశాక మళ్లీ వర్క్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
తల్లిని అయినా యవ్వనంగా కనిపిస్తున్నా.. మురిసిపోతున్న హీరోయిన్






