- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shefali Shah: ఆ వయసులో హీరోకు అమ్మగా నటించాలంటే భయపడేవాళ్లం: షెఫాలీ
ఈ రోజుల్లో వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్న మహిళలు గొప్ప పాత్రల్లో నటించడంపై షెఫాలీ షా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

దిశ, సినిమా: ఈ రోజుల్లో వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్న మహిళలు గొప్ప పాత్రల్లో నటించడంపై షెఫాలీ షా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ అనుభవాల గురించి మాట్లాడుతూ.. గతంలో 30 ఏళ్లు దాటిన స్త్రీలను సినిమా లేదా షోలల్లో కేవలం సపోర్టింగ్ క్యారెక్టరుకు మాత్రమే పరిమితం చేసేవారని చెప్పింది. అలాగే ఎవరైనా అందులో మీ పాత్ర ఏమిటి? అని అడిగితే.. ‘హీరోకు మమ్మీ, హీరోయిన్‌కు వదినగా నటిస్తున్నానమని చెప్పడానికి ఇబ్బంది పడేవాళ్లమని తెలిపింది. అయితే ప్రస్తుతం అవే క్యారెక్టర్లను లీడ్ రోల్‌లా నేటి రచయితలు తీర్చిదిద్దుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. అంతేకాదు ఆమె ఎక్కడినుంచి వచ్చింది? ఎక్కడ పనిచేసింది? ఎవరి సపోర్టుతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది? అనే వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి ఆమెను ఒక పాత్రగా గుర్తించి అవకాశాలివ్వాలంటూ పలు విషయాలు ప్రస్తావించింది.






