- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను ఎన్ని గంటలైనా పని చేస్తానని చెప్పే ఒకే ఒక్క పాన్ ఇండియా హీరోయిన్ ఆమెనే: ఎస్‌కెఎన్
ఇండస్ట్రీలో పనిగంటల విషయంలో దర్శకనిర్మాతలకే హీరోయిన్లు కండీషన్లు పెడుతున్నారు.

దిశ, సినిమా: ఇండస్ట్రీలో పనిగంటల విషయంలో దర్శకనిర్మాతలకే హీరోయిన్లు కండీషన్లు పెడుతున్నారు. ఈ విషయంపై చాలామంది పోరాటం చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ పనిగంటల విషయం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొణె తాను కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పడంతో సందీప్ రెడ్డి వంగాతో వివాదం తలెత్తింది. దీంతో ఆయన తన ప్రాజెక్ట్ కోసం దీపికాను సెలెక్ట్ చేసుకుని మరీ.. తొలగించేశాడు. ఆమె స్థానంలో త్రిప్తిని తీసుకున్నారు. అలాగే ఈ భామను మరో భారీ ప్రాజెక్ట్ ‘కల్కి-2’ నుంచి కూడా తీసేశారు. ఈ విషయంలో తాను సైలెంట్ యుద్ధం చేస్తున్నట్లు దీపికా వెల్లడించింది. ఇక ఆమెకు సపోర్ట్‌గా కొంతమంది హీరోయిన్లు సైతం పలు కామెంట్లు చేశారు. ఎన్ని గంటలు పని చేయాలనే విషయంపై ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది.
ఈక్రమంలో.. తాజాగా, ‘ది గర్ల్ ఫ్రెండ్’ (the girlfreind) ట్రైలర్ లాంచ్‌లో పాల్గొ్న్న ప్రముఖ నిర్మాత ఎస్‌కెఎన్(skn) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘యానిమల్, పుష్ప-2, థామాతో వచ్చిన రష్మిక కెరీర్‌కు ఉండదు కామా. కొందరిలో స్వీట్‌నెస్ ఉంటే.. మరికొందరిలో కూల్‌నెస్ ఉంటుంది. కొందరిలో హాట్‌నెస్ ఉంటది. ఏబీసీ జ్యూస్ లాగా అన్నింటినీ మిక్సీలో వేస్తే ఆమెనే. ఎంత ఎదిగినా సరే నేషనల్ క్రష్ ఫాలో అయ్యేది పబ్లిసిటీని కాదు సిప్లిసిటీని. నేను ఒక పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిన హీరోయిన్లలో అంత కమిట్‌మెంట్, డెడికేషన్ ఉన్న హీరోయిన్‌ను నేనెప్పుడూ చూడలేదు. ప్రస్తుతం మేము ఎన్ని గంటలు పని చెయ్యాలని డిబేట్ జరుగుతున్న టైమ్‌లో నేను ఎన్ని గంటలైనా పని చేస్తానని చెప్పే ఒకే ఒక పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న.
ఆమె పనిని గంటలతో చూడరు.. ప్రేమతో కొలుస్తారు. ప్రేమకి టైమ్ ఉండదు.. ఆవిడకి టైమింగ్ ఒక్కటే తెలుసు. అందుకే రష్మికను అందరూ మన ఇంట్లో అమ్మాయిగా భావిస్తారు’’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కామెంట్స్ ఎస్‌కెఎన్ దీపికాను ఉద్దేశించే అన్నాడని అంటున్నారు. పని గంటలకోసం పోరాటం చేసే వారికంటే.. పనిని ప్రేమతో చేసే రష్మికనే గ్రేట్ అని అభిప్రాయపడ్డాడు. కాగా.. రష్మిక మందన్న త్వరలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో రాబోతుంది. రాహు రవీంద్రన్ తెరకెక్కిస్తుండగా.. దీక్షిత్, అను ఇమాన్యుయేల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్‌లోకి రాబోతుంది.






