శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

by Mallepaka Hamsa |

చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి'(Nari Nari Naduma Murari) తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ రిలీజ్ డేట్ ఫిక్స్..
X

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి'(Nari Nari Naduma Murari) తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. రామ్ అబ్బరాజు (Ram Abbaraju)దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండబోతోంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ ఎక్సైటింగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. నారి నారి నడుమ మురారి 2026లో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇది తెలుగు సినిమా రిలీజెస్‌కి బిగ్గెస్ట్ సీజన్. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావడంతో సంక్రాంతి విడుదలకు పర్ఫెక్ట్. శర్వా ఈ పండుగ సమయంలో స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నాడు, శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి చిత్రాలు సంక్రాంతి విడుదలై పెద్ద బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇదే జోరులో ఈ పండుగ సెలవులు చిత్రానికి గణనీయమైన ఉత్సాహాన్ని ఇస్తాయని టీం నమ్మకంగా ఉంది.

Next Story