నన్ను చాలామంది మోసం చేశారు.. నేను జీవితంలో ఓడిపోయానంటూ శర్వానంద్ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయాడు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ ఆయనకు పెద్దగా కలిసి రావడం లేదు.

నన్ను చాలామంది మోసం చేశారు.. నేను జీవితంలో ఓడిపోయానంటూ  శర్వానంద్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయాడు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ ఆయనకు పెద్దగా కలిసి రావడం లేదు. వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ హిట్, ఫ్లాప్ అని ఆలోచించకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న మూవీ ‘బైకర్’ (Biker)తో రాబోతున్నారు. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ (Rajasekhar)కీలక పాత్రలో నటిస్తుండగా.. మాళవికా నాయర్ హీరోయిన్‌గా కనిపించనుంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ప్రెట్టీ బేబి మంచి ఆదరణను దక్కించుకున్నాయి.

దీంతో ‘బైకర్’ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగాచ ఓ కార్యక్రమంలో పాల్గొన్న శర్వానంద్ జీవితంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈరోజు మీ దగ్గరికి ఓ గెస్ట్‌‌లా రాలేదు.. ఒక అన్నలా వచ్చాను, నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. జీవితంలో చాలాసార్లు పడ్డాను, ఎన్నోసార్లు ఓడిపోయాను, మోసపోయాను. కానీ పడిన తర్వాత ప్రతిసారి నేర్చుకున్నాను. ఏదో ఒకటి జీవితం నేర్పించింది. మన కథ మనమే రాసుకోవాలి. బుక్ నీది..పెన్ను నీది, స్టోరీ నీది..మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండి’’అని చెప్పారు. ఇక ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న వారంతా అంతగా జీవితంలో శర్వానంద్‌కు ఏం జరిగిందని పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Next Story