- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లగ్జరీ కారు కొన్న శర్వానంద్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే? (వీడియో)
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) పెళ్లి తర్వాత కొద్ది కాలం ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.

దిశ, సినిమా: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) పెళ్లి తర్వాత కొద్ది కాలం ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. త్వరలో ‘నారి నారి నడుమ మురారి’ (nari nari naduma murari)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి ‘సామజ వరగమన’ ఫేమ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో పాటు సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ ‘భోగి’టైటిల్‌తో మాస్ ఎంటర్‌టైనర్‌ను చేస్తున్నాడు. అంతేకాకుండా ‘బైకర్’ (Biker)సినిమాలో కూడా నటిస్తున్నాడు.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇక సినిమాలవిషయం పక్కన పెడితే.. తాజాగా, శర్వానంద్ ఓ లగ్జరీ కారు కోనుగోలు చేశాడు. కొత్త కారును షోరూమ్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన వారంతా ఆ కారు వివరాల గురించి సెర్చ్ చేయగా.. షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. సుమారు రూ. 2.5 కోట్ల విలువైన లెక్సస్ ఎల్ఎం 350H (Lexus LM 350H) అనే అల్ట్రా లగ్జరీ కారు బ్లాక్ కలర్‌లో ఉంది.
ఇక ఇందులోని ప్రత్యేకతల విషయానికొస్తే.. విమానంలోని ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌లా ఈ కారు ఇంటీరియర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 48 అంగుళాల భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌తో, పూర్తిగా వెనక్కి వాలే ఎయిన్‌లైన్ స్టై్ల్ రెక్లైనర్ సీట్లు, 23స్పీకర్లతో కూడిన మార్క్ లెనిన్స్‌న్ సౌండ్ సిస్టమ్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు సమాచారం. మసాజ్ సీట్లు, చిన్న ఫ్రిజ్ వంటి సదుపాయాలతో ఉందట. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. సూపర్ అంటూ నెటిజన్లు శర్వానంద్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






