ఆలియాతో కలిసి బాక్సాఫీస్ వేటకు రెడీ అయిన శార్వరి వాఘ్.. ‘ఆల్ఫా’ రిలీజ్ డేట్ ఖరారు!

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-09 06:54:50  IST  )

‘ఆల్ఫా’ సినిమా థియేటర్లలో విడుదల కాదని, నేరుగా ఓటీటీలోనే వస్తుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మేకర్స్ స్పష్టం చేశారు.

ఆలియాతో కలిసి బాక్సాఫీస్ వేటకు రెడీ అయిన శార్వరి వాఘ్.. ‘ఆల్ఫా’ రిలీజ్ డేట్ ఖరారు!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, యంగ్ సెన్సేషన్ శార్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’ విడుదలపై గత కొన్ని రోజులుగా నడుస్తున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాదని, నేరుగా ఓటీటీలోనే వస్తుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమా విడుదల తేదీని మారుస్తూ చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నిజానికి ‘ఆల్ఫా’ చిత్రాన్ని మొదట 2025 క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల అది 2026 ఏప్రిల్ 17కి వాయిదా పడింది. అయితే, అదే రోజున సల్మాన్ ఖాన్ నటించిన భారీ చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ కూడా విడుదల కావాల్సి ఉంది. బాక్సాఫీస్ వద్ద ఇద్దరు పెద్ద స్టార్ల మధ్య క్లాష్‌ రాకూడదనే ఉద్దేశంతో, ‘ఆల్ఫా’ను మరోసారి వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

తాజాగా, శార్వరి వాఘ్ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమా జూలై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోందని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఓటీటీ విడుదలపై వస్తున్న పుకార్లన్నీ ఉత్తవేనని తేలిపోయింది. యష్ రాజ్ ఫిలిమ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆలియా భట్ ఒక పవర్‌ఫుల్ ఏజెంట్‌గా కనిపిస్తుండగా, శార్వరి వాఘ్ ఆమెతో కలిసి యాక్షన్ సీక్వెన్స్‌లలో అలరించనుంది. శివ రావైల్ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హృతిక్ రోషన్ (కబీర్ పాత్రలో) గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఉగాదికి వస్తుందనుకున్న ఈ చిత్రం జూలైకి వెళ్లడం అభిమానులను కొంచెం నిరాశపరిచినా, అవుట్‌పుట్ మాత్రం అదిరిపోతుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.

210 కోట్ల వసూళ్లు.. హీరోయిన్ రెమ్యూనరేషన్ మాత్రం 11 రూపాయలు

Next Story