శంకర్ భారీ ప్లాన్.. ఊహలకు మించి ఉండనున్న రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’!

by Disha Web Desk 6 |
శంకర్ భారీ ప్లాన్.. ఊహలకు మించి ఉండనున్న రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’!
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘గేమ్ చేంజర్’. అయితే ఈ సినిమా చాలా కాలంగా దిల్ రాజు నిర్మాణంలోనే ఉంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, చరణ్ సరసన నటిస్తోంది. తాజాగా గేమ్ ఛేంజర్ గురించి అదిరిపోయే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలోని పాటలకే దాదాపు రూ. 90 కోట్లు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

అసలు పాటల చిత్రీకరణ అంటే శంకర్ ఎలా చేస్తారో అందరికీ తెలిసిందే. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఫుల్ అవుతున్నారు. ఊహించని రేంజ్‌లో సినిమా ఉంటుందని కచ్చితంగా హిట్ కొడుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో పాటలన్నీ ఒకరే చేయలేదట. ప్రభుదేవా, జానీ మాస్టర్, ప్రేమ్ రక్షిత్, గణేష్ మాస్టర్ ఇలా ఒక్కొక్క పాట ఒక్కొక్కరు చేసినట్లు టాక్. మొత్తానికి ఈ మాటలు వింటుంటే సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయోనని మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అందులోనూ శంకర్‌కి ఇది మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడంతో పాటలతో పాటు, సినిమా కంటెంట్‌ను చూడాలని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Read More: మెగాస్టార్ VS సూపర్ స్టార్.. బరిలో గెలిచేదెవరు!

Next Story

Most Viewed