Shankar: రోబోలా మారిపోయిన డైరెక్టర్ శంకర్

by Disha Web Desk 10 |
Shankar: రోబోలా మారిపోయిన డైరెక్టర్ శంకర్
X

దిశ ,వెబ్ డెస్క్: రోబో సినిమాలు చేసి చేసి శంకర్ కూడా రోబోలా మారిపోయారు. ఈ బటన్ నొక్కితే ఇక్కడ ఆ బటన్ నొక్కితే అక్కడ వర్క్ పరంగా షిఫ్ట్ అవుతున్నారు ఆయన. పైగా ఇటు రామ్ చరణ్ అటు కమల్ హాసన్ సినిమా నేపథ్యం కుడా ఒకటి. మరి ఈ రెండు సినిమాలను శంకర్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? లేటెస్ట్ షెడ్యూల్ పోస్ట్ చేశారు శంకర్. గత వారం రోజులు గా వైజాగ్ అండ్ హైదరాబాద్ లలో కొన్ని సన్నివేసాలతో పాటు,పాటలు చిత్రీకరించారు శంకర్.

రామ్ చరణ్ పాత్ర పై ఈ సీన్స్ చిత్రీకరణ జరిగాయి. తాజాగా RC 15 షెడ్యూల్ కి ప్యాక్ అప్ చెప్పి కమల్ హాసన్ సినిమాకు షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ చైన్న్ లో జరగనుంది. ఒకేసారి 2 పాన్ ఇండియా సినిమాలను డైరెక్ట్ చేయటం అంటే చిన్న విషయం కాదు. కానీ దర్శకుడుకి మాత్రం చాలా కష్టమైన పని. పైగా శంకర్ గతంలో ఎప్పుడూ ఇలాగ చేయలేదు. అనుకోని పరిస్థితుల్లో ఇటు RC 15,అటు ఇండియన్ 2 చేస్తున్నారు.ఈ రెండు పొలిటికల్ సబ్జెక్ట్స్ అవ్వడం గమనార్హం. RC 15 సినిమాలో సమకాలిన రాజకియాలను చర్చిస్తున్నారు శంకర్. సబ్జెక్ట్ ఒకటే కావడం షెడ్యూల్ కి గ్యాప్ తీసుకుంటున్నాడు శంకర్. 2023 దసరాకు ఇండియన్2, సంక్రాంతి 2024 కి RC15 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రెండూ హిట్ అయితే శంకర్ రేంజ్ మాములుగా పెరగదు.దీని తరువాత అపరిచితుడు 2 హిందీ రిమేక్ కి కమిట్ అయ్యాడు శంకర్.


Next Story

Most Viewed