'Pathan' మూవీపై బాయ్‌కాట్ హెచ్చరికలు

by Disha Web Desk 7 |
Pathan మూవీపై బాయ్‌కాట్ హెచ్చరికలు
X

దిశ, సినిమా: షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న న్యూ మూవీ 'పఠాన్‌'. యష్‌రాజ్‌ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షారుఖ్‌ జోడీగా దీపికా పదుకొనెతోపాటు జాన్‌ అబ్రహం లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలోనే 'పఠాన్' చిత్రానికి గట్టిషాక్ తగిలింది.

కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాల విషయంలో బాయ్‌కాట్స్‌వల్ల పలు భారీ చిత్రాలు మరుగునపడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ పఠాన్ మూవీకి ఆ సెగ తగిలింది. దీనిపై కూడా పెద్ద ఎత్తున బాయ్‌కాట్ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందుకు కారణం రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌సాంగ్‌లో హీరోయిన్ దీపికా పదుకొనె వస్త్రధారణ, వాటి రంగు అసభ్యకరంగా ఉన్నాయని నార్త్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని కూడా నార్త్‌ ఆడియన్స్ పిలుపునిచ్చారని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది.

Also Read....

రెండు నెలల్లో Prabhas పెళ్లి..! షాకింగ్ న్యూస్ లీక్ చేసిన Ram Charan


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed