- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరిది చెంప పగలగొట్టిన హీరో భార్య.. ఇంతకీ ఏం జరిగిందంటే..
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ తన అభిమానులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటుంది.

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ తన అభిమానులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రతి విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా పంచుకునే ఈ బ్యూటీ తాజాగా ఓ షాకింగ్ వీడియోతో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. షాహిద్ కపూర్ తమ్ముడు, ఆమె మరిది, నటుడు ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ఆమె తమ ఇంటిలో కూర్చొని టీ తాగుతుండగా ఇద్దరిమధ్య ఏదో విషయంలో వాదన జరిగింది.
దీంతో ఆగ్రహానికి గురైన షాహిద్ 'మీరా మగతనాన్ని ధిక్కరించింది' అంటూ తమ్ముడితో ఆవేశంగా చెప్పగానే కోపంతో బయటకెళ్లిన ఇషాన్ కాసేపటికి ఇంటికొచ్చాడు. దీంతో అతనెక్కడో తప్పు చేసినట్లు భావించిన మీరా 'నాకు నీ ముఖం చూడాలని లేదు. ఇక్కడినుంచి వెళ్లిపో' అంటూ భర్తముందే తన మరిది చెంప చెళ్లుమనిపించింది. అయితే కావాలనే ఫన్నీగా చేసిన ఈ వీడియోను 'దిల్ క్యా చాహతా హై' అనే క్యాప్షన్‌తో షాహిద్ నెట్టింట షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఈ సరదా వీడియోపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.






