Aryan Khan : అరంగేట్రానికి రంగం సిద్ధం.. అఫీషియల్ పోస్ట్ వైరల్

by Disha Web Desk 13 |
Aryan Khan :  అరంగేట్రానికి రంగం సిద్ధం.. అఫీషియల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. అయితే అందరూ అనుకున్నట్లుగా ఆర్యన్ హీరోగా కాకుండా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మొదటి ప్రాజెక్ట్ స్క్రిప్ట్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఆర్యన్.. 'స్ర్కిప్ట్ పూర్తయింది. ఇక యాక్షన్ చెప్పడానికి వెయిట్ చేయలేకపోతున్నా' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ పోస్ట్‌లో స్క్రిప్ట్‌పై చేయి వేసిన ఆర్యన్ మొదటి పేజీ ఓపెన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించగా పక్కనే 'రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్' అని రాసిన క్లాప్‌బోర్డ్ కనిపిస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై స్పందించిన ఆర్యన్ తల్లి గౌరీ.. 'నీ పనిని చూడటానికి వేచి ఉండలేను' అని కామెంట్ చేయగా.. 'వావ్.. ఆలోచిస్తున్నాను.. నమ్ముతున్నాను.. కలలు కనడం పూర్తయింది. ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను. విష్ యూ ది బెస్ట్ ఫర్ ది ఫస్ట్ వన్. ఇట్స్ ఆల్వేస్ స్పెషల్' అంటూ తనదైన స్టైల్‌లో షారుఖ్ రియాక్ట్ అయ్యాడు. ఇక సంజయ్ కపూర్, భావనా పాండే వంటి సెలబ్రిటీలు సైతం ఆల్ ది బెస్ట్ చెబుతూ తన చిత్రం కోసం ఆసక్తిగా ఎదరుచూస్తున్నామంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.



Next Story

Most Viewed