బాహుబలి-2 రికార్డు బద్దలు కొట్టిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’

by Disha Web Desk 2 |
బాహుబలి-2 రికార్డు బద్దలు కొట్టిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా పఠాన్. ఎన్నో విమర్శలు, ఆటుపోట్ల మధ్య విడుదలైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వెయ్యికోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో అనేక రికార్డులను బద్దలు కొట్టిన పఠాన్.. తాజాగా బాహుబలి-2 రికార్డులను చెరిపివేసిట్లు తెలుస్తోంది. హిందీలో రూ.510 కోట్లు రాబట్టి టాప్‌‌ ప్లేస్‌లో ఉన్న బాహుబలి2 కలెక్షన్లను పఠాన్ దాటేసింది. ఏకంగా రూ.511 కోట్లు సాధించి బాలీవుడ్ చరిత్రలోనే పఠాన్ సినిమా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత రూ.434 కోట్లతో కేజీఎఫ్-2 మూడో స్థానంలో ఉండగా, రూ.387 కోట్లతో దంగల్ సినిమా నాలుగో స్థానంలో ఉంది. దీంతో షారుఖ్ ఫ్యాన్స్‌ ఫుల్ జోష్‌లో నెట్టింట పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు. ఇది షారుఖ్ స్టామినా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి : ‘బలగం’ సినిమాపై వివాదం.. కథ నాదంటున్న గడ్డం సతీష్



Next Story

Most Viewed