- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్జరీ చేయించుకున్నానంటూ షారుఖ్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్.. ఆందోళనలో అభిమానులు
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shahrukh Khan) వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shahrukh Khan) వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రజెంట్ ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్’.యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాను సుజోయ్ ఘోష్(Sujoy Ghosh) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఆనంద్ నిర్మాణంలో రూపొందిస్తున్నారు. ఇందులో దీపికా పదుకోణె(Deepika Padukone), రాణీ ముఖర్జీ, జాకీ ష్రాఫ్, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే షారుఖ్ ఖాన్ గారాలపట్టి సుహానా ఖాన్ (Suhana Khan)కూడా ప్రధాన పాత్ర చేయనుంది. ఇటీవల షూటింగ్ జరగ్గా.. ఇందులో షారుఖ్ ఖాన్ గాయపడ్డారు. ఓ యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా చేస్తుండగా.. అనుకోని విధంగా గాయాలాపాలయ్యారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు ఆందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజులు షూటింగ్ కూడా నిలిపివేశారు మూవీ మేకర్స్. గాయం అయినప్పటి నుంచి షారుఖ్ రెస్ట్ తీసుకుంటున్నారు.
ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అర్థంకాక అభిమానులంతా అయోమయంలో పడిపోయారు. ఈనేపథ్యంలో.. షారుఖ్ కుమారుడు తెరకెక్కి్స్తున్న ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్ని తన ఆరోగ్యం గురించి పలు విషయాలు తెలిపారు. ‘‘కింగ్ షూటింగ్‌లో గాయం కావడం వల్ల నేను సర్జరీ చేయించుకున్నాను. ప్రస్తుతం ఒక్క చేతితోనే బ్రష్ చేస్తున్నాను.. నా పనులు పూర్తి చేస్తున్నా. నేను ఇంకో రెండు నెలల్లో పూర్తిగా కోలుకుంటాను. అవార్డు అందుకోవడానికి ఒక చెయ్యి చాలు. కానీ నా అభిమానుల ప్రేమను భుజానికెత్తుకోవడానికి మాత్రం ఒక చెయ్యి సరిపోదు’’ అని అన్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొందరు ఆందోళన చెందుతుండగా.. అభిమానులు మాత్రం మీరు ఎంత తొందరగా కోలుకుంటే మాకంత సంతోషం అని కామెంట్లు పెడుతున్నారు.






