షారుఖ్ ఖాన్ బర్త్ డే సర్‌ప్రైజ్.. ‘కింగ్’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ విడుదల

by Mallepaka Hamsa |

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్ (Shahrukh Khan)వరుస సినిమాలతో బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘కింగ్’(king) ఒకటి.

షారుఖ్ ఖాన్ బర్త్ డే సర్‌ప్రైజ్.. ‘కింగ్’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ విడుదల
X

దిశ, సినిమా: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్ (Shahrukh Khan)వరుస సినిమాలతో బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘కింగ్’(king) ఒకటి. రీవెంజ్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విలన్‌గా అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), అనిల్ కపూర్, రాఘవ్ జుయల్, హర్షద్ వార్సీ, జాకీ షరఫ్ కీలక పాత్రలో కనిపించనుండగా.. దీపికా పదుకొణె (Deepika Padukone)హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాతో షారుఖ్ కూతురు సుహానా ఖాన్ కూడా భాగం కావడం విశేషం.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కింగ్’ మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నేడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కావడంతో ‘కింగ్’ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక ఇందులో బాద్‌షా ఊహించని అవతారంలో కనిపించాడు. చెవి పోగుతో.. నోట్లో కింగ్ కార్డు పెట్టుకుని ముక్కులోంచి రక్తం కారుతున్నా పట్టించుకోకుండాయాక్షన్ మోడ్‌లో ఉన్నాడు. వర్షంలో విలన్స్‌ను చితక్కొడుతూ.. కొత్త అవతారంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక అది చూసిన ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నట్లు సమాచారం.

link

Next Story