'పఠాన్' సాంగ్ కు ఢిల్లీ ప్రొఫెసర్ల డ్యాన్స్.. షారూఖ్ రియాక్షన్ ఇదే..!

by Dishafeatures2 |
పఠాన్ సాంగ్ కు ఢిల్లీ ప్రొఫెసర్ల డ్యాన్స్.. షారూఖ్ రియాక్షన్ ఇదే..!
X

​దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా వసూల్లు ఇప్పటికే రూ.1000 కోట్లు దాటాయి. షారూఖ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా పఠాన్ నిలిచింది. గత నెల 26న రిలీజైన ఈ మూవీ అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ థియేటర్లను షేక్ చేస్తోంది. కాగా తాజాగా ఈ మూవీ ప్రభావం ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని జేఎమ్ కాలేజ్ కామర్స్ ప్రొఫెసర్లపైన కూడా పడింది. క్యాంపస్ లో జరిగిన ఓ కల్చరల్ ప్రొగ్రాంలో విద్యార్థులతో కలిసి లేడీ ప్రొఫెసర్లు పఠాన్ మూవీలోని 'జూమె జో పఠాన్' సాంగ్ కు డ్యాన్స్ విరగదీశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కాగా.. కింగ్ ఖాన్ ఆ వీడియోను చూసి ఫిదా అయ్యాడు. ప్రొఫెసర్ల వీడియోను తన ట్విట్టర్ లో పోస్టు చేస్తూ..'' మనకు విద్యాబుద్ధుల నేర్పిస్తూ.. మనతో సరదాగా గడిపే టీచర్లు, ప్రొఫెసర్లు ఉండటం చాలా లక్కీ.. వాళ్లంతా ఎడ్యుకేషనల్ రాక్ స్టార్స్'' అంటూ కామెంట్ చేశాడు. కాగా షారూఖ్ ఖాన్ ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అనే విషయం తెలిసిందే.



Next Story

Most Viewed