మక్కాలో ఉమ్రా చేసిన Shah Rukh Khan.. ఏం కోరుకున్నాడో తెలుసా?

by Dishanational2 |
మక్కాలో ఉమ్రా చేసిన Shah Rukh Khan.. ఏం కోరుకున్నాడో తెలుసా?
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తు్న్న మూవీ 'పఠాన్'. వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషిస్తుండగా సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌ చేస్తున్నాడు. ఇదిలావుంటే.. కొన్ని రోజులుగా సౌదీ అరేబియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ చివరి షెడ్యూల్ ముగిసిన వెంటనే షారుఖ్ 'మక్కా'ను సందర్శించాడు. అనంతరం సౌదీ అరేబియా ఆతిథ్యం పట్ల ఆ దేశ కల్చరల్ మినిస్ట్రీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో షేర్ చేశాడు. దీంతో వైరల్ అయిన వీడియోపై స్పందిస్తున్న అభిమానులు.. 'షారుఖ్ ఖాన్ ఈ రోజు #మక్కాలో ఉమ్రా చేశాడు. అల్లా అతని ఉమ్రాను అంగీకరించాలి' అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక మక్కాలో తనతోపాటు అందరిపై ఆ దేవుడి కృప ఉండాలని కోరుకున్నట్లు షారుఖ్ తెలపడం విశేషం.


Next Story