కొనసాగుతున్న ‘పఠాన్’ వేట.. 49వ రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

by Disha Web Desk 2 |
కొనసాగుతున్న ‘పఠాన్’ వేట.. 49వ రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సుదీర్ఘ విరామం తర్వాత నటించిన పఠాన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సునామీ సృష్టించింది. ఈ సినిమాతో గ్లామరస్ బ్యూటీ దీపిక పదుకొణె నాలుగోసారి షారుక్ ఖాన్‌తో జంటగా నటించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయింది. విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధించిన పఠాన్ సినిమా ఇప్పటికీ రూ.1044 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. తాజాగా.. ఈ సినిమాకు 49వ రోజు ఒక్క రోజే సుమారుగా రూ. 2 నుంచి 3 లక్షల వరకు కలెక్షన్స్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: ధూమ్ 4 లో పఠాన్ హీరో?

Next Story

Most Viewed