మోడల్ కోసం పిజ్జా తయారు చేసిన బాలీవుడ్ స్టార్.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
మోడల్ కోసం పిజ్జా తయారు చేసిన బాలీవుడ్ స్టార్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, మోడల్ నవ్‌ప్రీత్ కౌర్‌‌కు అతిథి మర్యాదలు చేశారు. అంతేకాకుండా మన్నత్‌లోకి సాధరంగా ఆమెకు స్వాగతం పలికి స్వయంగా ఆయనే పిజ్జాను తయారు చేసి పెట్టారు. తాజాగా, ఈ విషయాన్ని నవ్‌ప్రీత్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలుపుతూ స్పెషల్ పోస్ట్ పెట్టింది. ‘‘మన్నాత్‌లో గడిపిన ఈరోజు నా జీవితంలో చాలా స్పెషల్. ఈ ఫొటోలను నా సోషల్ మీడియాలో పోస్ట్ చేయనని ప్రామిస్ చేశాను. కానీ ఇవి నా దగ్గర దాచుకో లేనంత విలువైన సంపద. అది అందరికి తెలియాలి.. బాలీవుడ్ కు రారాజు నా కోసం పిజ్జా చేశారు. అది కూడా వెజ్ పిజ్జా.. ఈ విషయం చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను నిజంగా షారుఖ్ ఇంట్లో.. మన్నత్ లో ఉన్నాను అంటే అది కలగానే అనిపించింది. ఎవరైనా నన్ను నిద్ర లేపుతారేమో అని అనుకున్నాను. అంతే కాదు షారుఖ్ తో కలిసి డైనింగ్ ను పంచుకోవడం.. నా జీవితంలో మర్చిపోలేను.. అదే టైమ్‌లో నేను వాష్ రూమ్ దారి అడగడం.. అక్కడ అంత మంది ఉన్నా.. స్వయంగా షారుఖ్ నన్ను డోర్ వరకు తీసుకెళ్లడం.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను’’ అంటూ నవ్‌ప్రీత్ రాసుకొచ్చింది. అంతేకాకుండా షారుఖ్‌తో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.

Read More: Janhvi Kapoor :తనను పెళ్లి చేసుకోబోయేవాడు ఎలా ఉండాలో వెల్లడించిన జాన్వి

సల్మాన్ ఖాన్ స్మోకింగ్ వీడియో వైరల్.. నెటిజన్లు ఫైర్

Next Story

Most Viewed