‘Jawan’లో నటించింది Sharukh Khan కాదా? డూప్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్

by Disha Web Desk 6 |
‘Jawan’లో నటించింది Sharukh Khan కాదా? డూప్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్
X

దిశ, సినిమా: ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘జవాన్’.. భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్‌లు రాబట్టి పలు రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఈ తరుణంలో షారుఖ్‌కు సంబంధించి ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీలో షారుఖ్‌కు ఒక డూప్ ఉన్నాడట. అతని పేరు ప్రశాంత్ వాల్దే. గత 15ఏళ్లుగా షారుఖ్ రెండో పాత్రలో నటిస్తున్నాడట. ‘జవాన్’ సినిమాలో షారుఖ్ డబులో రోల్‌లో ప్రశాంత్ వాల్దే నటించినట్లు తెలుస్తోంది. అలాగే షారుఖ్‌కు డూప్‌గా నటించినందుకు ప్రశాంత్ వాల్దే పారితోషికం భారీగా తీసుకుంటాడట. రోజుకు రూ.30 వేలు చొప్పున నెలకు రూ.9 లక్షల వరకు తీసుకుంటాడట. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో రైటర్‌గా, డైరెక్టర్‌గా కూడా కొనసాగుతున్నాడు ప్రశాంత్ వాల్దే.

ఇవి కూడా చదవండి : ఎంత సక్సెస్ ఉంటే అంత అందమైన అమ్మాయి వస్తుందంటూ.. అట్లీ పై ట్రోల్స్ చేస్తున్న నెటిజెన్స్


Next Story

Most Viewed