సీనియర్‌కు సెమిస్టర్ పరీక్షలున్నాయ్.. ‘జూనియర్’ సినిమా ఓటీటీ విషయంలో బిగ్ ట్విస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-24 03:18:31  IST  )

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల (SreeLeela) గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ రెడ్డి (Kiriti Reddy)కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘జూనియర్’ (Junior).

సీనియర్‌కు సెమిస్టర్ పరీక్షలున్నాయ్.. ‘జూనియర్’ సినిమా ఓటీటీ విషయంలో బిగ్ ట్విస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల (SreeLeela) గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ రెడ్డి (Kiriti Reddy)కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘జూనియర్’ (Junior). ఇక ఇందులో జెనీలియా కీలక పాత్రలో కనిపించింది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను.. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇక ఈ చిత్రం జూలై 18 రిలీజ్ కాగా.. వైరల్ వయ్యారి అంటూ శ్రీలీల కుర్రకారులో హీట్ పుట్టించింది. ఇక ఈ సినిమా వచ్చిన రెండు నెలలకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రముఖ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు. కానీ ఈ మూవీ ఓటీటీలో కనిపించకపోవడంతో అంతా అయోమయంలో పడిపోయారు. సినీ ప్రియులంతా నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఆహా సంస్థ ‘జూనియర్’ సినిమా ఓటీటీపై బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ‘జూనియర్’ మూవీ సెప్టెంబర్ 30న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘‘సీనియర్‌కి సెమిస్టర్ పరీక్షలున్నాయి. అందుకే ‘జూనియర్’ ఈ నెల 30న వస్తున్నాడు’’ అనే క్యాప్షన్ జత చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story