కొత్త కామెడీ ఆర్టిస్తుల కారణంగా అవకాశాలు కోల్పోతున్న సీనియర్ కమెడియన్లు

by Disha Web Desk 9 |
కొత్త కామెడీ ఆర్టిస్తుల కారణంగా అవకాశాలు కోల్పోతున్న సీనియర్ కమెడియన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్ట్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న గెటప్ శ్రీను, హైపర్ ఆది లాంటి కమెడియన్లు ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా జూనియర్ కమెడియన్ల కారణంగా అలీ, ప్రవీణ్ లాంటి వాళ్ళకు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇక ఆది, గెటప్ శ్రీనులతో పాటు మొన్న విడుదలైనా ‘బెదురులంక 2012’ చిత్రంలో ఆటో రాంప్రసాద్ కూడా చాలా బాగా కామెడీ చేసి అందరిని కడుపుబ్బా నవ్వించాడు. దీంతో వీరికి మరిన్ని సినిమా ఛాన్స్‌లు రావొచ్చని జనాలు చర్చించుకుంటున్నారు. నిజంగా వీళ్ళ లైఫ్ ఈ రోజు ఇలా ఉండటానికి ముఖ్యంగా జబర్దస్తే కారణమని చెప్పాలి.



Next Story