ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 7 |
ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటుడు శరత్ బాబు గురించి అందరికి తెలిసిందే. 1973లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. అప్పట్లో అమ్మాయిలకు డ్రీమ్ బాయ్‌గా ఉండేవాడు. ఇక 220 కి పైగా సినిమాల్లో నటించిన ఈయన ప్రస్తుతం అడపదడపా స్క్రీన్‌పై కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శరత్ బాబు అనారోగ్యంతో చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.

అంతే కాకుండా పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ‘‘నాకు ఇష్టమైన హీరో అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్ బాబు తొందరగా కోలుకోవాలని మనం స్వామిని వేడుకొందాం శ్రీరామరక్ష’’ అంటూ ఓ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కాగా.. నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: అనుష్క బొద్దుగా మారడానికి ఆ సమస్యే కారణమా?



Next Story