వెడ్డింగ్ గౌనులో మైమరపించిన సెలీనా.. చేసుకునేవాడు అదృష్టవంతుడేనట

by Disha Web Desk 7 |
వెడ్డింగ్ గౌనులో మైమరపించిన సెలీనా.. చేసుకునేవాడు అదృష్టవంతుడేనట
X

దిశ, సినిమా : అమెరికన్ సింగర్, యాక్ట్రెస్ సెలీనా గోమెజ్ బ్యూటీఫుల్ లుక్‌లో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది. అందమైన తెల్లని వెడ్డింగ్ గౌనులో కనిపించిన నటిని చూసి ‘పెళ్లి చేసుకుందా?’ అనే డౌట్‌తో నెటిజన్లు కంగారుపడ్డారు. విషయానికొస్తే.. సెలీనా నటిస్తున్న తదుపరి వెబ్ సిరీస్ ‘ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్’.

అయితే ఈ షూటింగ్‌లో భాగంగా వైట్ గౌన్ ధరించి సెట్స్‌లో అడుగుపెట్టిన బ్యూటీ.. అచ్చం నవ వధువులాగే కనిపించింది. అంతేకాదు ఇదే లుక్‌లో విభిన్న రీతుల్లో ఫోజులిస్తూ ఫొటోలు దిగిన సింగర్.. ఆర్కోనియా భవనం నుంచి బయటకు పరుగెత్తుతున్నపుడు తెల్లటి నెమలి వలే మైమరపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా.. ‘సెలీనాను పెళ్లి చేసుకున్నవాడు అదృష్టవంతుడు. ఆమె యువరాణిలా కనిపిస్తోంది’ అంటూ అందాన్ని పొగిడేస్తున్నారు.

Next Story

Most Viewed