పెళ్లి సంబంధం చూడండి.. సోను సూద్ సంచలన వ్యాఖ్యలు!

by Disha Web Desk 9 |
పెళ్లి సంబంధం చూడండి.. సోను సూద్ సంచలన వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సమయంలో ఎంతో మందికి సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్న సోన్ సూద్ గురించి పరిచయం అక్కర్లేదు. 28 రాష్ట్రాల్లోని ప్రజలకు సాయం చేసిన ఈ హీరోను ప్రపంచం మొత్తం గుర్తించింది. ఐక్యరాజ్య సమితి ఎస్డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డు కూడా అందజేసింది. ఈయన కోసం ఫ్యాన్స్ ఏకంగా గుడి కూడా కట్టించారు. తాజాగా సోనూ సూద్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి నుంచి సిస్సు కారులో వెళ్తుండగా.. రోడ్డు పక్కన ఓ మొక్కజొన్న స్టాల్ కనిపించడంతో.. సోన్ సూద్ వెంటనే స్టాల్ వద్దకు వెళ్లాడు. ఆ స్టాల్ యజమానిని రోజుకు ఎన్ని మొక్కజొన్నలు అమ్ముతారని అడిగారు. ‘ఒక్కొక్క మొక్కజొన్న రూ.50 చొప్పున ప్రతిరోజు 100 అమ్ముతాను. నాకు నలుగురు సోదరులు, ఒక సోదరి ఉంది. నాకు ఇంకా వివాహం కాలేదు.’ అని జాన్ పూర్‌కు చెందిన శేష ప్రకాష్ నిషాద్ అనే వ్యాపారి చెప్పడంతో సోను సూద్ నిషాద్ కోసం పెళ్లి సంబంధం చూడమంటూ ఒక వీడియోను నెట్టింట షేర్ చేశాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed