‘ఆదిపురుష్’ నుంచి సెకండ్ సింగిల్ కు డేట్ ఫిక్స్..

by Chukka Sudharani |   (  Updated:2023-05-25 15:49:13  IST  )

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘ఆదిపురుష్’.

‘ఆదిపురుష్’ నుంచి సెకండ్ సింగిల్ కు డేట్ ఫిక్స్..
X

దిశ, సినిమా: ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘ఆదిపురుష్’. ఇతిహాస గ్రంథం రామాయణం ఆధారంగా వస్తున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తుండగా.. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘జై శ్రీరామ్’ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేయగా, ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మే 29న ఈ రెండో పాటని టీవీ ఛానెల్స్, మ్యూజిక్ ప్లాట్ ఫామ్ లు, యూట్యూబ్, రేడియో స్టేషన్ లో ఏకకాలంలో రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read..

Prabhas Megastar Chiranjeevi :ప్రభాస్ సినిమాని ‘ఛీ’ కొట్టిన చిరంజీవి..

Prabhas Anushka Shetty :ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకుంటే జరిగేది అదేనంట?

Next Story