- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ సినిమా నుంచి ‘మింగలేక మంగళారాం’ సాంగ్ రిలీజ్ చేశారు.

దిశ, సినిమా: శ్రీనాథ్ మాగంటి (Srinath Maganti)హీరోగా బాల సతీష్(Bala Satish) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’(Mansion House Mallesh). గాయత్రి రమణ, సాయి, కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla)హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలలై ఈ సినిమా ఫస్ట్ సింగిల్, టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు.. మేకర్స్ ‘మింగలేక మంగళారాం’ సాంగ్ రిలీజ్ చేశారు. సురేష్ బొబ్బిలి అందరికీ కనెక్ట్ అయ్యే ట్యూన్‌ని కంపోజ్ చేశారు. బిత్తిరి సత్తి పెక్యులర్ వోకల్స్ సాంగ్‌లో హైలెట్‌గా నిలిచింది. మల్లేష్ క్యారెక్టర్ గురించి ఎంటర్టైనింగ్ చెప్పిన విధానం అలరించింది. తరుణ్ సైదుల్ రిలిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రాజేష్, మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, సాయి ప్రసన్న, పద్మ నిమ్మనగోటి, హరి రెబెల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మార్చి 6న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.






